స్నేహం
స్నేహం
చెడిపోయిన మనిషిలోని మంచిని పెంచాలి
తడియారిన కళ్లలోన వెలుగులు నింపాలి
సమాధిపై మొక్కకూడ పువ్వులు పూస్తుంది
తన ఉనికిని కాదుసుమా మనసుని కొలవాలి
ఒకరికొకరు రాసుకుంటు దంపతులు తిరిగినా
తమతనువులు కాదుసుమా తలపులు కలవాలి
స్వచ్ఛమైన నీరుకూడ అడుసులో కలిసిన
తనరూపం కాదుసుమా స్నేహం తలవాలి
అమ్మకంటె నాన్నెపుడూ దూరమే
కాఠిన్యం కాదుసుమా కరుణను తడమాలి
