స్నేహం బంధం
స్నేహం బంధం
ఏ జన్మ వరమో
ఈ స్నేహం.
ఏ పుణ్య ఫలమో
ఈ నేస్తం.
చిన్ననాటి చెలిమి లో
చిలిపి తగాదాలు..
ఎన్నటికీ చెరగని
తీపి జ్ఞాపకాలు...
పరువపు పరిచయాలు ఎన్నైనా
పలికే ప్రియ నేస్తం ముందు
అన్నీ శూన్యాలే కదా.
చేయి పట్టి నడిపి
అడుగు నేర్పు నాన్న
నోరు తెరిచి అడగకుండానే
ఆకలి తీర్చు అమ్మ
బాధలోనూ, సంతోషంలోను
తోడు నిలుచు తోబుట్టువు
అన్ని రూపాలు దాల్చు మిత్రుడు
కాదా మనసుకు స్వాoతన నిచ్చే
ఆత్మ బంధువు.
ఉన్నతి లో వెన్ను తట్టువాడు
ఓటమిలో సైతం నీ వెంట
ఉండు తోడు
ప్రతి దశలో ఉండే బంధం..
మంచి చెడులను విడమర్చే గ్రంధం
నిను నడిపే ఇంధనం..
మనిషికి దొరికిన అద్భుత వరం.
మాతృ దేవోభవ
పితృ దేవోభవ
ఆచార్య దేవోభవ
అతిథి దేవోభవ
అన్న సూక్తుల నడుమ
నేస్తాన్ని చేర్చ లేదంటే
సూక్తులలో చెప్పలేనిదీ
స్నేహబంధo
ఎవరికి వారే అనుభూతించి,
ఆస్వాదించే అందమైన సుమగంధం.
***%%%***
ఫణికిరణ్
03:00 pm
