STORYMIRROR

Gayatri Tokachichu

Classics

3  

Gayatri Tokachichu

Classics

సనాతన ధర్మం

సనాతన ధర్మం

1 min
7

సనాతన ధర్మం 

(వచనకవిత )


వేల యేండ్లకు పూర్వమీ సనాతన ధర్మం 

పాలనంబు చేసి గెల్చె పృథ్వీ మండలం 

ఘనతరమైన వేద ధర్మమే పూజనీయం 

కనుమరుగవుతుండటం చాల దురదృష్టం!


పరుల పాలనలో జరిగెనా విధ్వంసం 

వెరపుతో విలవిలలాడిన పూర్వ జ్ఞానం 

స్థిరమతులైన సద్గురువుల ధర్మ ప్రబోధనం 

శిరోధార్యమనుచు భక్తితోడ స్వీకరిద్దాం!


కొనయూపిరితో నేడు ఘన సనాతన ధర్మం 

మినుకు మినుకు మనుచున్నదీ దివ్య తేజం 

జనుల కెందుకీనాడంతు లేనట్టి నిర్లక్ష్యం?

మనికి నిడుచు మనధర్మాన్ని నిలబెడదాం!


వదలించుకొనుచు బహుకాలపు బద్ధకం 

కదలివచ్చినచో మన దేశ యువతరంగం

చిరకాలం దీప్తితో చిలుకుచుండి ప్రకాశం 

వరలునీ సనాతనధర్మం యుగాలపర్యంతం.//



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics