సమయమిదే
సమయమిదే
పదవిపట్ల వ్యామోహం..వదలాల్సిన సమయమిదే..!
ధర్మనిష్ఠగల వారే..గెలవాల్సిన సమయమిదే..!
జాతిమేలు దేశప్రగతి..తలచి పూని చేతురెవరు..
నోట్లిచ్చే వారి అంతు..చూడాల్సిన సమయమిదే..!
కులకక్షలు మతచిచ్చులు..రెచ్చగొట్టు చర్యలేల..
స్వార్థ రాజకీయాలను..కూల్చాల్సిన సమయమిదే..!
ఓటరులే దేశభవిత..నిర్ణేతలు సత్యమిదే..
ప్రలోభాల పాలబడక..ఉండాల్సిన సమయమిదే..!
బుద్ధిలేని నాయకులకు..బుద్ధిచెప్పి తీరాలిక..
ప్రజాస్వామ్య పరమార్థం..కాచాల్సిన సమయమిదే..!
