సమస్య
సమస్య
పద్యం:
సంద్ర మంత చిక్కు సాధించు సమయాన
మత్స్య రూపు దాల్చు మరవకుండ
కాదు సింహ మనిన కడలి నిను మునుపు
బుద్ధిధాత్రి దివ్య భారతాంబ!
భావం:
తల్లీ భారతీ! సమస్య అనేది సముద్రం లాగా ఉన్నప్పుడు మత్స్య రూపం దాల్చాలి.. కాదు కూడదు అని సింహాన్ని అని విర్రవీగుతే కడలి లో మునిగి పోతావు. (సమస్య పెద్దగా ఉన్నప్పుడు తెలివిగా, సూక్ష్మంగా ఆలోచించి పరిష్కరించాలి అని అర్థం. )
