STORYMIRROR

Midhun babu

Romance

3  

Midhun babu

Romance

సిగ్గంటే

సిగ్గంటే

1 min
110

పెదవి ఏమి చెప్పగలదు..పిలుపుకెంత సిగ్గంటే..! 

గుండెసడియె చెప్పగలదు..మనసుకెంత సిగ్గంటే..!


వేగిపోవు విరహానికి..ఉపశమనం ఎప్పుడోయి..

చెక్కిలెరుపు చెప్పగలదు..సిగ్గుకెంత సిగ్గంటే..!


ఏ నిప్పుల వానైనా..అది ఎంతట ప్రేమముందు..

ఒక గులాబి చెప్పగలదు..చినుకుకెంత సిగ్గంటే..!


చేమంతుల వనమెంతగ..చిన్నబోయె తనే రాక.. 

చెలియచూపు చెప్పగలదు..వలపుకెంత సిగ్గంటే..!


తనకోర్కెల వనమిప్పుడు..చిగురులెలా వేసిందో.. 

తలపు మెఱుపు చెప్పగలదు..ముద్దుకెంత సిగ్గంటే..! 


Rate this content
Log in

Similar telugu poem from Romance