STORYMIRROR

Madhuri Devi Somaraju

Drama

4  

Madhuri Devi Somaraju

Drama

శశి

శశి

1 min
312

శంభుని శిరమున నిలచీనావూ

శరభుని సైతం తాకీనావూ

శార్దూల వాహిని నుదుటన బింబము నీవూ

శ్రీ రాముని నామమునూ చేరీనావూ

శరత్కాలముకు నాయకుడవూ

శశి అను అందమైన నామధేయుడవూ

శ్వేతవర్ణనమూను కలిగీనావూ

శివకేశవులిరువురినీ చుట్టీనావూ

సముద్ర తనయా సకల గుణ కారకా

లక్ష్మీ సహోదరా లావణ్య రూపా

సౌందర్యమునకు ప్రతిరూపము నీవే

సోమునిగా వెలిగీనావే



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Drama