శీర్షిక : మసకబారుతున్న మమతలు
శీర్షిక : మసకబారుతున్న మమతలు
మల్లెల సువాసన చామంతులకు రాదు
చామంతుల అందం మల్లెలకు లేదు
ఎవరి సామర్థ్యం వారిదే...
అయినా
ఎందుకో తెలియని అసూయ ద్వేషాలు
ఆవిరైన అనుబంధాలు...
తేనే మాటల వెనక విషపు కత్తులు
ఓర్వలేనితనంతో బురద చల్లే పనులు
అడ్డుగోడలుగా నిలిపిన అహంభావాలు
అంతరించిపోయిన అనురాగాలు...
స్వార్ధపు తెర కమ్మేసిన ఆలోచనలు
పగబట్టి నీడలా సాగుతున్న విద్వేషాలు
మచ్చుకైనా కనపడని ఆప్యాయత ఛాయలు
మసకబారుతున్న మమతలు...
నీటి బుడగ లాంటిది జీవితాలు
అన్నీ తెలిసినా మార్చుకోలేని మనస్తత్వాలు
కన్నీటికి ఆనకట్ట వేసి ఒడ్డు చేరే దారి తెలియక
గోరుతో పోయేదాన్నికి గొడ్డలితో జవాబులు
ఇదే నేటి మనుషుల తీరు...!!
--జ్యోతి మువ్వల
