సౌఖ్యమందు
సౌఖ్యమందు
చిరు నవ్వుల తోటమల్లె మనసుంటే సౌఖ్యమందు..!
అరవిరసిన మొగ్గమల్లె మోముంటే సౌఖ్యమందు..!
చెప్పాలని ఎంతున్నా వినేందుకు ఏమున్నది..!
దివ్యజ్ఞాన దీపమల్లె పలుకుంటే సౌఖ్యమందు..!
ఉపన్యాస మివ్వాలను ఉబలాటము వ్యర్థమౌను..!
మౌనరాగ వర్షమల్లె చూపుంటే సౌఖ్యమందు..!
తోటివారి మనసు తెలిసి మసలుకొనుట అసలు విద్య..!
నీలిమేఘ మాలమల్లె వలపుంటే సౌఖ్యమందు..!
నిత్యసత్య వేదమంటి నీ శ్వాసయె నీకు గురువు..!
మైత్రివీణ నాదమల్లె తలపుంటే సౌఖ్యమందు.
