ఋణము
ఋణము


పద్యం:
ఋణము ధనము వుండు రుద్ర రూపంబున
పరుల ధనము వుండు పాము వోలె
కటిక తమము నందు కారమన్నమె మేలు
బుద్ధిధాత్రి దివ్య భారతాంబ!
భావం:
తల్లీ భారతీ! అప్పు తీసుకుంటే దాని వడ్డీ పెరుగుతూ అది భయంకర రూపంలో కనిపిస్తుంది. పరుల సొమ్ము పాము వంటిది అనే సామెత ఉంది కదా... కాబట్టి కటిక చీకటిలో ఉండి కారం అన్నం తిని అయినా బ్రతకాలి కానీ అప్పు చేయకూడదు.