STORYMIRROR

Midhun babu

Classics Inspirational Others

3  

Midhun babu

Classics Inspirational Others

రైతన్న

రైతన్న

1 min
7


అమ్మకన్న మిన్న నీవు..నీవేగా నిజ దైవము..! 

మాయన్నా రైతన్నా..తీర్చుటెలా నీ రుణము..! 


నిత్యకర్మ వీరుడవే..సకలజీవ మిత్రుడవే.. 

చిందింతువు నీ స్వేదము..నీ ప్రేమకు లేదు సమము..! 


రెప్పవాల్చవింత నీవు..శ్రమధర్మము మరువవింత.. 

ఎంతవింత జన్మ నీది..దాచవేది నీ కోసము..!


ఈ మట్టిని ఆ మబ్బును..నమ్ముకున్న గుండె నీది..

వెన్నముద్ద నీ మనసే..అమృతకరుణ ప్రతిరూపము..! 


పుడమితల్లికే తల్లివి..తనను కాచు తండ్రి నీవె.. 

పొలంగట్టు నీ పానుపు..నాగలియే నీ ప్రాణము..! 



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics