రైతేరాజు
రైతేరాజు
రైతే రారాజు
(ద్విరదగతి రగడ )
సారంబు కోల్పోయి చవిటి నేలయి ధరను
పాఱు జలములులేక పంటలు శూన్యమగును
నకిలీ విత్తనములు నాసిరకపు మందులు
చీకటిలో పయనము చింతలోన రైతులు
నీరసంబుగ సాగ నిత్యమౌ వేదనలు
తేఱిజూడగ నేడు దేశమందు కరువులు
పాలించు పాలకులు పంటభీమా పెంచ
మేలంచు రైతులే మిక్కిలి సంతసించ
భూగర్భ జలములను పొందుగా రక్షించ
సాగుబడి రైతులకు సబ్సిడీ నందించ
జల సంరక్షణకై జనులెల్ల శ్రమియించ
పలుతెఱంగుల కూడి పాదపంబుల పెంచ
జలజలా వర్షంబు జగతిపై కురియంగ
కలతలెల్ల మాయమై కష్టములు తీరంగ
సారవంతమౌ భూమి సస్యముల నీయగా
నారుమడిలో సిరులు నవ్వులను పంచగా
చల్లగా సైరికులు సంపదలు పంచెదరు
పిల్లపాపల తోడ వేడ్కగా బ్రతికెదరు.//
