రామచరిత
రామచరిత
రామచరిత.
(ద్విరదగతి రగడ )
బోయవాడొకడు తా పున్నెములు పొందుచూ
ప్రాయమున తపముతో పట్టుదల చూపుచూ
వ్రాసి రామాయణము పరమార్థ తత్త్వముగ
భాసురమౌ కీర్తిని వసుధలో పొందెనుగ
వాల్మీకి కావ్యమును భక్తితో వినుచుండ
కల్మషంబును వీడి కరుణను చూపుచుండ
శాంతి ధర్మంబులు జగతిలో నిల్చులే
భ్రాంతులను విడనాడి ప్రజలు మెల్గెదరులే
రక్కసుల దునుమాడి రాజుగా పాలించె
చక్కదిద్దుచు జగతి చక్రంబు నడిపించె
శ్రీరామ చరితంబు శ్రేయంబు కలిగించు
తారకరాముడెపుడు దయ చూపి కరుణించు
దాశరథిని గొల్వగ తామసంబు తొల్గును
ఆశలే తీరగా నానందము మిగులును
భూజాత సీతతో భువినేలి వెలిగాడు
మాజాతి నాయకుడు మాన్యతను నిలిపాడు //
