పూజనీయము -పుడమి తల్లి
పూజనీయము -పుడమి తల్లి
(కవిత )
చెట్టునరికి పుట్టను కొట్టి
మట్టి త్రవ్విన భావి తరము
కూలిపోవును కాలిపోవును
తెలియలేదా? విలువ లేదా?
నేర్చుకొనుము సంరక్షణము
బాగుచేయుము భవితవ్యము
స్వార్థమించుక తగ్గించుకొని
పుడమి తల్లి గోడు వినుము!
పూజనీయమౌ భూమి మనది
పుట్టినింటిని పూడ్చి వేయకు!
జలము లోన కలుషితంబు
కలప వద్దు !కలప వద్దు!
పర్వతంబులు పట్టినూర్చుచు
నుగ్గుచేయుచు నునుపు చేసి
చదును చేయ చావు తప్పదు
నదులు గిరి సానువులకు
హాని చేయకు!అగ్గిపెట్టకు!
గనులు త్రవ్వి గంప కెత్తకు!
విత్తుకోసము చెత్త పనులను
చేసి ధరకు చిచ్చు పెట్టకు!
ప్రాణమిచ్చెడి ప్రకృతి మన
భవిత నిల్పు బంధువనుచు
ప్రేమమీరగ పెంచుకొన్నచో
జయము నీకు జతగ కూడు.
***********************