STORYMIRROR

Radha Krishna

Classics Inspirational Children

4  

Radha Krishna

Classics Inspirational Children

పునరావృతం అవుతుంది

పునరావృతం అవుతుంది

1 min
238


విభిన్న మనస్తత్వాలు

భిన్న అభిరుచులు

ఆలోచనలు అనుసరణలు

ఏదీ ఒక్కటి కాదు

అయినా కలిపి ఉంచేవి

ఒకప్పటి బంధాలు.

కలిసి పోరాడేందుకు సంసిద్ధం

నా కుంటుంబం అనే 

ఉత్కృష్టమైన ఆనాటి 

మానసిక బంధం.


పొట్టకూటికై వలసలు

నేను ఎదగాలి అనే స్వార్ధం

నేను నాది అనే విష సంస్కృతి

సర్దుకోలేని తత్వం 

నాటింది విషబీజాలు మనసుల్లో

పెంచాయి మనుషుల 

మధ్య ఎడబాటు వృక్షాలు మెడదుల్లో

ఎవరికోసమో కాదు నాకోసం నేను

అనే తత్వం పెంచింది విచ్ఛిన్నాన్ని


అవే భిన్న తత్వాలు

కాలమాన పరిస్థితులు

కలిసి ఉండడం కష్టం

కలిపి ఉంచడం ఇంకా కష్టం

ఇష్టంలేని కాపురం చేయించలేము

ఇష్టంలేని గుఱ్ఱానికి నీరు కూడా పెట్టలేము.

అనేవి నేటి కాలానికి ప్రతీకలు.


అయినా, మనం ఆశాజీవులము

కాల చక్రంలో పాతవి తిరిగి 

పునరావృతం అయినట్లు

మరల ఒకనాటి స్వచ్ఛమైన

కుటుంబం మరల ఏర్పడుతుందని ఆశిద్దాం.


✍️✍️By Radha


Rate this content
Log in

Similar telugu poem from Classics