పుల్ల ఐసు /
పుల్ల ఐసు /
పుల్లఐసు పుల్లఐసు//
బడి వీధిలో కనుపించే దైవం
బండి వెనకే పరిగెత్తే బాల్యం
భయమెరుగని కాలంలో
బంగారు పరిమళం
రొప్పుకుంటూ రోజుకుంటూ దూకుతూ నేవస్తే
ఎర్రఐసు పిలుస్తుంది పది పైసలు చాలంటూ
పాల ఐసు పది చాలదు పొమ్మంటే
కొబ్బరైసు కొనగలిగే డబ్బులేవి నాదగ్గర.
అంత లావు డబ్బాలో
ఎన్నెన్ని ఐసులో
ముచ్చట్లాడుతు ఉంటాయి ఊసులెన్నో చెప్పుకుంటూ
చేతిలోన పడగానే
కరిగి పోయి నీరవుతూ
బడిగంట వినగానే చటుక్కన మాయమవుతూ
ఐసు కరిగి పుల్ల మిగిలి
ఆనందపు టంచులలో
అర్ధమవని బాల్యంలో
రేపోకటే పిలుస్తుంది
పుల్లఐసు!పుల్లఐసు!
