పసిడిమొగ్గల పేదరికము
పసిడిమొగ్గల పేదరికము


---------------------------
పేదరికముతో పిల్లలు బెంగపడుచు
కృంగు చుండిరి మదిలోన కుమిలి పోయి...
పిడికెడన్నము దొరికిన పెన్నిధి వలె
బ్రతుకు చుందురీ జగతిలో భయము నొంది.
తల్లి తండ్రుల జాడయే దైవ మెరుక?
తల్ల డిల్లుచు పిల్లలు తనరు చుండ
వేళ కింత యన్నము పెట్టి వెతలు తీర్చి
పెద్ద మనసుతో లోకులు పేర్మి తోడ
కాచ వలయును బిడ్డలన్ గాపుదలగ.
దేశ మేదైన కానిండు!తిమిర మందు
మ్రగ్గు చున్నట్టి పిల్లల మంచి కోరి
రూక నొక్కటి నీయగా లోకమందు
పేదరికమీ జగంబును వీడి పోవు.
బడికి పంపించి బిడ్డలన్ బాగు పరిచి
చేయి నందించి నిల్పగ జీవితములు
బాల లందరు నవ్వుచు బ్రతుకు చుంద్రు.
పౌష్టి కాహార లోపమున్ బారదోలి
భావి భారత దేశపు బావుటాలు
బాల లందరు రేపటి పౌరులనుచు
వీధి బాలల యభివృద్ధి ప్రేమమీర
సలుపు చుండిన చాలును జగతి వెలుగు./