STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

ప్రతి బింబం

ప్రతి బింబం

1 min
306

తినేతినే ప్రతిగింజకు..కృతజ్ఞతయె మనిషితనం..!

క్షమించగా నీవెవ్వరు..నీకరుణయె మనిషితనం..! 


అద్దమంటి హృదయానికి..ప్రతిబింబం నీవేలే.. 

మనస్సాక్షి వర్షించే..సాత్వికతయె మనిషితనం..!


దైవత్వపు చిరునామా..దొరకదెపుడు అక్షరాల.. 

ప్రతికణమున చూడగలుగు..ప్రవిమలతయె మనిషితనం..! 


ప్రతిజీవీ తనసమమని..బోధపడిన వెలిగేనా.. 

అహింసకే కట్టుబడిన..విలోకతయె మనిషితనం..! 


శ్వాసమాటు గురుతత్వం..అంది పుచ్చు కున్నదెవరొ.. 

అంతులేని స్నేహసుధా..ప్రపూర్ణతయె మనిషితనం..! 


మౌనగగన తీర్థాలను..భువికి దించునదే ప్రేమ.. 

మాటల సుమాలు పరచే..విశుద్ధతయె మనిషితనం..!


Rate this content
Log in

Similar telugu poem from Romance