STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

ప్రియమనసా

ప్రియమనసా

1 min
217


నీకు దూరమొక్కక్షణం నిలువలేను ప్రియమనసా 

వెలుగులేక చీకటినే చూడలేను ప్రియమనసా


ఉదయాన్నే తట్టిలేపు కిరణాలే నీ ఊసులు

నీతోడును నేనెపుడూ వీడలేను ప్రియమనసా 


గుండెతాకు చూపులవీ ముల్లులేని గులాబీలు

స్పందించక ప్రాణాలే వదలలేను ప్రియమనసా 


హత్తుకునే మంత్రమవుతు అందమైన బొమ్మనీవు

నీవులేని చిత్రాన్నే గీయలేను ప్రియమనసా 


నీపలుకే బంగారం‌ చిరునవ్వే చిరునామా 

నీవులేక రామపాట పాడలేను ప్రియమనసా


Rate this content
Log in

Similar telugu poem from Romance