STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

ప్రియా ❤️❤️

ప్రియా ❤️❤️

1 min
310

నీకనుదోయిలో కనిపించేను నాలోకమోయి...

నావీనులకి వినిపించేది నీస్వరమొకటేనోయీ...

నీకరముల వీడదు నాచేయి...

నీపదముల చేరుటే నాగమ్యమోయి...

ఈజీవితాన ననువీడకోయి...

మరుజన్మకి కూడా నీచెలిమిని వరమీయి...

నీ తలపుల తుంపర నా వలపుల వెల్లువ...

నీ అధరమధురవచనము నా కర్ణామృతము...

నీ అందం నా హృదిలో రేపేను హంసానాదము...

నీ కరస్పర్సే నా తనువున వేయివీణలు మీటేను

నీలో సంగమాగమమే నా మోక్షామార్గము...


   ...సిరి✍️


Rate this content
Log in

Similar telugu poem from Romance