STORYMIRROR

Midhun babu

Romance

3  

Midhun babu

Romance

ప్రేమలేఖలు గా

ప్రేమలేఖలు గా

1 min
131

కోకిల గొంతున..తరగని ధనమును..!

ఉగాది కవితకు..పచ్చని ధనమును..!


అడవిని తంగెడు..తోటై పెరిగితి..

బ్రతుకమ్మలకే..పెట్టని ధనమును..!


ఉసిరిక చెట్టుకు..ఊపిరి నైతిని..

చెఱకున చేరిన..తియ్యని ధనమును..!


మామిడి జామల..కొమ్మల వాలితి..

గరికను పెంచే..ఆరని ధనమును..!


పాలపిట్టనై..ప్రాణము పోసెద..

నెమలికన్నులను..వీడని ధనమును..!


ఏనుగు దంతమె..సిరిగా నిలిపెద..

ఊచబియ్యమున..వెచ్చని ధనమును..!


ఆవుపాలతో..అభిషేకములే..

ప్రియమగు రాముని..చల్లని ధనమును..!


సంక్రాంతులనే..వెలిగింతునుగా..

ముంగిళ్ళకునే..చక్కని ధనమును..!


పప్పుబెల్లముల..ఆటలు ఎన్నో..

ఈతబెత్తమును..మరువని ధనమును..!



Rate this content
Log in

Similar telugu poem from Romance