ప్రేమ విలువ
ప్రేమ విలువ
ఓడిపోక తప్పదులే..చెప్పబోతె ప్రేమవిలువ..!
ఆగిపోక కుదరదులే..కట్టబోతె ప్రేమవిలువ..!
ఎన్నికథలు ఎన్నికలలు..చిన్నిగుండె గూటిలోన..
చెదిరిపోక నిలువదులే..చెక్కబోతె ప్రేమవిలువ..!
బంధాలను కాపాడే..అనుబంధపు జాడ ఏది..
తప్పిపోక ఉండదులే..వ్రాయబోతె ప్రేమవిలువ..!
అంతరంగ భావగరిమ..అనుభవాల సారమదే..
ఎగిరిపోక నవ్వదులే..చాటబోతె ప్రేమవిలువ..!
వసంతాల సందడిలో..రాలిపోవు ఆకులెన్నొ..
మండిపోక అందదులే..పంచబోతె ప్రేమవిలువ..!
ఒకరి మత్తు ఇంకెవరో..వదిలించగ వీలెలాగ..
పొంగిపోక పొర్లదులే..పట్టబోతె ప్రేమవిలువ..!
