STORYMIRROR

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

మైత్రి

మైత్రి

1 min
354


ఆట వెలదులు /

1.

సాధుజనుల మైత్రి సంపద వంటిది

కలుష మెల్ల కడిగి గరిమ తోడ

వెంట నడిచి వచ్చి విలువలు బోధించి

భవ్యమైన పరమ పథము చూపు /


2.

కలిమిలేములందు కష్ట కాలము నందు

స్నేహితుండు మనకు చెంత నిలిచి 

మనసు పొంగునట్లు మమకారమును జూప

జగతి గెలువ వచ్చు సత్య మి ని

శుద్ధమగును మనసు శుభము కల్గు

తృష్ణ వీడి మనము తృప్తిని సాధింప

సత్త్వగుణము పెరుగు సత్య మిదియె./


4.


సత్త్వగుణము తోడ సత్యమ్ము నెఱిగిన

కనులకున్న పొరలు కరిగి పోవు.

ధ్యానయోగ మందు దైవంబు వెల్గినీ

హృదయమందు నిలచి హృష్టి నిచ్చు./


5.

పరమ పావనంబు పరమాత్మ మైత్రియే

తెలిసి మసలు కొన్న తీరు చింత.

గోపబాలుడెపుడు కూర్మితో కాపాడి

చెలిమి చేయుచుండు చెంత నిలచి.



Rate this content
Log in

Similar telugu poem from Classics