ప్రేమ పూల వర్షం...
ప్రేమ పూల వర్షం...
నాపై కురిసిన నీ ప్రేమ పూల వర్షం....
నిలువెల్లా... నాలో....ఏదో..
తెలియని.. గిలిగింత...
అర్థం కానీ పులకింత....
భావాలు ఎన్నో ఊసులాడుతూ
నా మదిలో....
పదాల అల్లిక కుదరక...
తికమక....
నిలిచిపోవాలని ఉంది....
నీ హృదయంలో....
చెరిగి పోనీ... తరిగి పోనీ
బంధన్నై....
హేయ్.... హృదయవాసి....
నీ ప్రేమకు ఏ పేరు పెట్టమంటావ్....
ఎలా పిలువ మంటావు....
నా ప్రేమ ఎలా తెలుపమంటావు...
చెప్పి పోవా... మరొక్క సారి....

