ప్రేమ లేఖ
ప్రేమ లేఖ
ప్రేమలేఖ వ్రాయబోతె..నవ్వుతున్నవి మాటలు..!
మౌనమెంత దుర్భరమో..మూల్గుతున్నవి మాటలు..!
దాహబాధ తీర్చు చెలమ..నీ తలపే నిజముగా..
కాలమెంత జారిపోయె..మసలుతున్నవి మాటలు..!
ఆశ చావని మనసుతో..యాతనెంతో చూడవు..
చెలిమి కోరుట నేరమా..గొణుగుతున్నవి మాటలు..!
మెఱుపులాగ ఒక్కసారి..మెరిసి మాయమైతివా..
ఏకాంతము నివ్వలేక..సణుగుతున్నవి మాటలు..!
నన్ను కన్న తలిదండ్రుల..ఆచూకీ ఎఱుగను..
నే గాలికి పెరిగినట్లు..చాటుతున్నవి మాటలు..!
చిన్నిపరిచయ మాత్రమే..బంధమేదో తెలియదు..
నీవే సకలము సర్వము..పాడుతున్నవి మాటలు..!