రచన సల్పు
రచన సల్పు
1 min
0
చదవాలను ఉత్సాహం..వెలిగించే రచన సల్పు..!
వివేకాన్ని మదిమదిలో..ఊరించే రచన సల్పు..!
ప్రశాంతతకు ప్రతిరూపం..ఆలోచన మాటున్నదె..
తననుతాను తెలుసుకోగ..తపియించే రచన సల్పు..!
ఆనందమె పరమావధి..అసలు దాని రూపమేది..
అక్షరమే అపురూపం..గ్రహియించే రచన సల్పు..!
మారణాయుధా లెందుకు..మౌనవాక్కు నీదైతే..
అంతరంగ ప్రబోధాన్ని..అందించే రచన సల్పు..!
శ్వాసమాటు చేరినంత..సృష్టిరచన బోధపడును..
ప్రతి జీవిని చెలిమిమీర..ప్రేమించే రచన సల్పు..!