నేను తను
నేను తను
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
ఓయ్...
ఈ పిలుపులో ఎన్ని వేల ప్రేమ చినుకులో..
నువ్విలా పలకరించిన ప్రతిసారీ
పులకరించిన మనసునడుగు..
నువ్వొస్తావన్న ఒక్క విషయాన్ని
ఎన్ని సార్లు మననం చేసుకుంటుందో..!
నీ పలుకు కులుకులలో మునిగిన నాకు
రేయేదో, పగలేదో తెలియకుండానే గడిచిపోతుందే..!
ఎక్కడ లేని సంతోషాన్ని
దోసిళ్ళతో తెచ్చి నా దాహన్ని తీరుస్తావే..
మరి నీకు తెలియదా..
నువ్వంటే నాకెంత ప్రేమోనని..!
వెచ్చని ఊహలకు వెన్న రాసినంత
తేలిగ్గా *ఇక ఉండనా* అంటూ ఒక్కసారిగా లేచెళ్ళిపోతావే..
కరిగిన వెన్నముద్దలా నా ప్రాణం నీరుగారి పోతుంటే అస్సలు పట్టించుకోవే..!
యుగాలు క్షణాలుగా గడిచే నీ సాన్నిధ్యం ఎంత హాయో కదా నాకు.
మరి తెలియదా నీకు..?
నా బుంగమూతిఫై బుజ్జిగా చిటికేస్తూ నవ్వేస్తావే..
గడుగ్గాయివే..
కలిసిన ప్రతిసారీ ఓ కమ్మని కావ్యమేగా..
తుంటరి పనులన్నీ ఒంటిగా చేసేస్తూ నన్ను అల్లేస్తావే..
నన్ను మారు మాటాడనీయకుండా
పెదవి సంకెల వేస్తావే..
ఎంత గడసరి వయసో..
నీతో వంత పాడేస్తూ
సరిగమల సరాగాలు పాడేస్తుంద