ఓ పులకింత కై
ఓ పులకింత కై
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
ఆ జ్ఞాపకాలు వర్ణించినప్పుడల్లా నేను తడిచి
ముద్దవుతుంటాను చిల్లులు పడ్డ గొడుగు నుండి
జారిపడే చుక్కల్ని చప్పరిస్తూ
ఒక అనిర్వచనీయ అనుభూతికి లోనయిన మధుర
క్షణాలు నా బాల్యంతో అనేకం మమేకమే...
చెప్పులు లేని కాళ్ళు చెప్పని కథలెన్నో బురదలో సరదాగా
పారి-పోయాయి మట్టివాసన పూసుకున్న చిరుజల్లు నేలకు
తాయిలాలు పంచే విశాల హృదయవతి రూపమై ఓ సన్నని
నీరెండకు యవనికను దించే మనోహర దృశ్యం...
నాతో గుడ్డలు తడుపుకున్నవారు ఏ గడ్డపై కాళ్ళ కీళ్ళు
నొక్కించుకుంటున్నారు గెడ్డాలు నెరసి ఎక్కడ సేదతీర్చుకుంటున్నారో………
వీలుచేసుకునిఒకసారి పలకరించవచ్చుకదా ఒకసారి
పులకించి పులకింపజేయచ్చు కదా నేస్తం?