మూడు పూవులు ఆరు కాయలు
మూడు పూవులు ఆరు కాయలు
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
1 min
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
1
చెదలు పట్టి
మొదలు కరిగిపోయినా...
మిగిలిన చెట్టు...
ఆకులు వేసి
పూలి పూసి
ఫలములను అందీయ...
హృదయాన మూలుగుతున్న...
మొక్కువోని ఆత్మస్థైర్యాన్ని గుర్తుచేసే...
వృక్షము గుర్తుచేసే..
మానవ జీవితపు అగాథాలు...
అన్ని పరిస్థితుల కు ఎదురు నిలచే...
స్వభావాన్ని అన్నింటికీ ఇచ్చాడు కదా...
ఆ పరమాత్ముడు...
కానీ...
ఓడిపోతున్నాడు గా...
నిస్సహాయుడిగా ..జీవుడు...
వృక్షము నేర్పించే పాఠాలు...
జీవుడు అనుసరించినా...
జీవితాన్ని...
మూడు పువ్వులు ఆరు కాయలుగా...
మార్చుకోక పోవునా.