నీ స్నేహం
నీ స్నేహం
1 min
1
వ్రాయలేని అద్భుతమౌ..కావ్యమంటె నీ స్నేహం..!
పాడరాని అమృతమధుర..గీతమంటె నీ స్నేహం..!
అలుకలకే తావులేని..అవగాహన నీతోనే..
హాయిగూర్చు కాంతిపూల..గానమంటె నీ స్నేహం..!
మల్లియలకు జోలపాడు..నీ మౌనం మధురము కద..
పలకరించు మేఘమాల..రాగమంటె నీ స్నేహం..!
కలల అలల కడలిఘోష..ఆలకించి తీర్చు చెలీ..
అలసటలకు వీడుకోలు..తానమంటె నీ స్నేహం..!
నెలవంకల నగరి కదా..నీ నగవుల ఆ ముచ్చట..
అరకన్నుల కోవెలింటి..దీపమంటె నీ స్నేహం..!