ప్రేమ కన్న తీపి గాయం
ప్రేమ కన్న తీపి గాయం
ప్రేమకన్నా తీపిగాయం..ఉండలేదని తెలియవా..
వెర్రి మనసున చెప్పలేని..బాధలేగా చూడగా..!
చెలిమివిలువే పట్టకుండా..పీచులెక్కలు చిత్రమే..
ఏవి శాశ్వత మిక్కడంటే..నీడలేగా చూడగా..!
కలలమేడలు కాలిపోతే..కలతనిదురే మానవా..
విషయసుఖమే ముచ్చటైతే..గొడవలేగా చూడగా..!
పట్టుపరుపే వెక్కిరిస్తే..తెల్లవారుట ఆగునా..
విరహమే ఒక రాగమైతే..పాటలేగా చూడగా..!
ఉరుములేవో మెఱుపులేవో..తోడుదొంగలె ప్రేయసీ..
నీలిమబ్బుల పల్లకీలో..చుక్కలేగా చూడగా..!

