STORYMIRROR

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

పరాత్పర పథము

పరాత్పర పథము

1 min
2

పరాత్పర పథము.
(వచన కవిత)

**************************
ఘనుడుగు విశ్వావసు సుతగా మదాలస జననము 
ఘనతర శాస్త్రముల యందు సాధించె ప్రావీణ్యము.

అతిలోక సౌందర్య రాశిగా నామె జగతిలో ప్రసిద్ధము.
అతులితమైన జ్ఞాన సంపదతో నా యువతి చరించటము.

రక్కసుడౌ పాతాళకేతుచే నా తరుణి నిర్భంధించ బడటము.
చక్కని రాజకుమారుడగు ఋతుధ్వజునితో కాపాడ బడటము.

సతిగా, మాతృమూర్తిగా, రాణిగా చేసె నామె కర్తవ్యపాలనము.
పతికి ననురాగ మూర్తిగా చరించుచుండెడి పాతివ్రత్యము.

నిరతమాధ్యాత్మిక సాధనతో జ్ఞాన సముపార్జనమమోఘము.
తరతరములకా జ్ఞానము నందించాలనే తపనతో జీవనము.

ఘనమౌ పరాత్పర పథము నందుకోవాలనే లేమ తాపత్రయము.
తన పుత్రులను సైతమా విద్యలో నిష్ణాతులను చేయటమే లక్ష్యము.

పతి వియోగముతో ప్రాణ త్యాగము చేసుకున్న మాదాలస కథనము.
సతి కొఱకు ఋతుధ్వజుడు విరాగిగా మారి చరించుట శోచనీయము.

తుదకు మదాలసా ఋతుధ్వజుల కథ సుఖాంత మగుట సంతోషము.
ముదముగా నా దంపతులాధ్యాత్మ బాటలో పయనించుటే పుణ్య ఫలము.//
**************************


Rate this content
Log in

Similar telugu poem from Classics