STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

2  

Midhun babu

Romance Classics Fantasy

పోతున్నది

పోతున్నది

1 min
79

సందె వేళ చీకటితో పగలు కలిసి పోతున్నది 

రేయి కొరకు జాబిలిలో వెలుగు నింపి పోతున్నది


నింగి వరకు చేరాలని అలలకెంత ఆరాటం!

ఆ కోరిక తీర్చలేక కడలి అలసి పోతున్నది 


చెలియ తోడు దొరికేందుకు ఎన్నాళ్ళీ ఎదురు చూపు 

జోడు లేని గువ్వవోలె మనసు మిగిలి పోతున్నది 


అంతు లేని విశ్వంలో నా ఉనికిని గ్రహించాను 

నాలోపలి శూన్యాలను బ్రతుకు చెరిపి పోతున్నది 


వేదాల్లో లేనిదసలు లేదంటే ఎలా శివా?

ఈ వాదన వలన వాటి విలువ తరిగి పోతున్నది


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance