STORYMIRROR

Midhun babu

Classics Fantasy Inspirational

3  

Midhun babu

Classics Fantasy Inspirational

పల్లెతనం

పల్లెతనం

1 min
4


పరిమళించు పల్లెతనం..పంచడమే పని ఇప్పుడు..!

అందమైన అడవి మనసు..నిలపడమే పని ఇప్పుడు..!


స్వచ్ఛతకై పరుగులేల..ఆ తలపే అసలు ధనం.. 

మంచుపూల మేఘమల్లె..కదలడమే పని ఇప్పుడు..! 


ఎంత మండు సూర్యుడైన..కాల్చలేడు కాలుష్యం.. 

ఈ పుడమిని నందనవని..చేయడమే పని ఇప్పుడు..! 


మదిలోపలి కల్మషాలు..తొలగించే మందు కలదు.. 

చిరునవ్వుల పూలతోట..పెంచడమే పని ఇప్పుడు..! 


కోపమొస్తె రానీలే..నీ కోపం పారిపోగ.. 

చెలిమిచెలమ తీర్థంలా..మిగలడమే పని ఇప్పుడు..! 



Rate this content
Log in

Similar telugu poem from Classics