పలకరింపు
పలకరింపు
పలకరింపు
(కవిత )
బంధుమిత్రుల రాక బరువుగా తోచగా
విందువినోదంబులు వెఱపుకలిగించగా
తల్లిదండ్రుల మాట తలనొప్పియనుకొనగ
పిల్లలా చరవాణి వెఱ్ఱిలోన తెరలగ
పొరుగుతో నెప్పుడూ పొట్లాట పెంచగా
చిరచిరలాడుచూ జీవితము గడుపగా
ఒంటరి తనంబుతో నోర్పు నశియించగా
మంటలే నెగయంగ మానసము క్రుంగగా
ఖేదముగ జనులెల్ల ఖిన్నులై దిగులుగా
వ్యాధులెల్ల హెచ్చగ భారముగ బ్రతుకగా
జాతిలో నీవేళ శాంతి మృగ్య మాయెగ
నీతి కీ జగతిలో నెలవుకరు వాయెనుగ
పలకరింపుతో నీ వసుధనే గెలువగా
చిలకరించగ సుధలు చెలిమి విరబూయుగా
పెద్దల దీవెనతో ప్రేముడి బంధుగణము
మద్దతుగ నడువంగ మంచి జరుగుట నిజము
సమైక్యతతో మెల్గ జాతికే శుభమగును
మమతవర్థిల సంఘ మర్యాద నిలబడును.
ఆరోగ్యవంతులై హాయిగా గడిపెదరు
ధీరతగ నీ జనులు దేశమును నడిపెదరు.//
