పలకరింపు...
పలకరింపు...
ఓ పలకరింపు ఓ జీవితాన్ని
నిలబెడుతుంది.............
ఓ పలకరింపు మానసిక ఔషధంగా
పని చేస్తుంది................
ఓ పలకరింపు పోయే కొన ప్రాణాన్ని
నిలబెడుతుంది.............
ఓ పలకరింపు చల్లని ఓదార్పులా
ఊరడిస్తుంది...............
ఓ పలకరింపు నీకు కొత్త ప్రపంచాన్ని
పరిచయం చేస్తుంది.............
ఓ పలకరింపు నిను విజయం వైపు
నడిపిస్తుంది.................
ఓ పలకరింపు నిన్ను వ్యక్తిగా
తీర్చి దిద్దుతుంది............
ఓ పలకరింపు అనురాగాల పవిత్ర బంధానికి
నూతన బాట వేస్తుంది...............
ఓ పలకరింపు నీ వ్యక్తిత్వానికి
సాక్ష్యంలా నిలుస్తుంది................
