పిల్లల పఱుగు
పిల్లల పఱుగు
పిల్లలు నిద్దుర లేచిరి
స్నానము పానము చేసిరి
పలకా బలపము పట్టిరి
పఱుగున బడికే వచ్చిరి
బడిలో బుద్దిగ నిలిచిరి
చదువుల తల్లికి మ్రొక్కిరి
గురువుకు దండము పెట్టిరి
గురుతుగ గణితము చెప్పిరి
వర్ణము లన్నియు దిద్దిరి
బడిలో నాటల నాడిరి
అలసటతో నింటికి వచ్చిరి
అమ్మ పెట్టిన పండ్లను తింటిరి
చెరువు గట్టుకే వెళ్ళిరి
చిందులు వేయుచు
నాడిరి
రాతిరి పాఠాలు చదివిరి
అమ్మా నాన్నను చేరిరి
అరుగు మీద బువ్వను తింటిరి
బామ్మ చెప్పిన కథలను వింటిరి
హాయిగా నిద్దుర పోయిరి.
--------------------------------
