పిచ్చి పరుగు...శ్రీనివాస భారతి
పిచ్చి పరుగు...శ్రీనివాస భారతి


పరుగులు పరుగులు పరుగులు
ఆశల వెంట అడుగులు
సంపాదిస్తే చాలునంటూ
తరాల తరబడి మూటలు కడుతూ
ఎందరి దోచి, మాయలునేర్చి
మోసం ద్వేషం పగలు పెంచి
నెత్తురుకూడును నెత్తినపెట్టి
బంగ్లాలెన్నో బాగా కట్టి
ఏం సాధించావనుకొంటున్నావ్
ఎవర్ని ఉద్ధరించననుకున్నావ్
భార్యా బిడ్డల మ్యూనిమనుమలకై
పాపపు రాసుల లంకెల బిందెలు
ఆరోగ్యాలు తాకట్టుపెట్టి
రోగాలతో నేస్తం కట్టి
రోజుకోకడుగా పాఠం నేర్పిన.
ఇంకా రాని బుద్ధి అదెందుకు
పోయేటప్పుడు వెంటరానిది
సంస్కారానికి సరిపోలనిది
నిన్ను నిన్నుగా చూపించేది
నలుగురి నోటా పలికించేది
మరణంలోనూ తోడుండేది
ధనం, అందం, ఐశ్వర్యం కాదు
బూడిద తప్ప ఏమి మిగలదు
నలుగురు చెప్పె మంచి మాత్రమే....
------------@@@@@@@@@@-------------