పడిగాపులు
పడిగాపులు
ఎంత గొప్ప కానుకోయి..ఈ తియ్యని పడిగాపులు..!
నీ సన్నిధి చేరుటకే..కను మలగని పడిగాపులు..!
ఆలోచన లాగిపోయి..ఎన్నియుగా లయ్యిందో..
వలపులేల విసిరినావొ..ఇవి మాయని పడిగాపులు..!
చుట్టేసే సుడిగాలిగ..వస్తావను ఆశ చూడు..
ప్రేమపూల వానలోన..గోర్వెచ్చని పడిగాపులు..!
ఈ 'శార్వరి' కోకిలమై..పాడుతోంది రేయంతా..
నీ అడుగుల సడి వినగా..తనువెరుగని పడిగాపులు..!
తెలవారగ చూడలేను..కోరలేను మరి ఏదీ..
నీ జతలో కరిగేందుకు..మది చెదరని పడిగాపులు..!
