పాట కట్టాలా
పాట కట్టాలా
చేను తడుపు చెమటధార..వ్యథకు పాట కట్టాలా..!
ఆత్మహత్య పాలబడ్డ..తల'కు పాట కట్టాలా..!
గిట్టుబాటు ధర పలుకని..పంటకన్న భారమేది..
పదునులేక బీడుపడ్డ..కథకు పాట కట్టాలా..!
కాబూలీ వడ్డీయే..పురుగుమందు దిక్కు చూపె..
కన్నకష్ట మెఱుగలేని..చెఱ'కు పాట కట్టాలా..!
చదువుకొన్న యువత శక్తి..పరదేశం పాలయ్యెనె..
పరిశోధన లేమాయెనొ..కల'కు పాట కట్టాలా..!
లోటులేని పథకాలే..నోచుకోను దారెక్కడ..
మరి కల్తీ విత్తనాల..సుధకు పాట కట్టాలా..!
