ఓర్పు
ఓర్పు
మార్పదెంత అనివార్యమొ..నేర్పేదే ఓర్పు..!
మౌనముతో మాటాడగ..చేసేదే ఓర్పు..!
కాలమేమి పాఠాలను..బోధించదు పట్టి..
అనుభవాల లోగిలిలో..నిలిపేదే ఓర్పు..!
తీర్పుచెప్పు సంగతియే..భయంకరము చూడు..
బుద్ధికింత వివేకాన్ని..ఇచ్చేదే ఓర్పు..!
ఆగలేని తనముకన్న..శత్రువెవరు లేరు..
సహజ గుణములెల్ల సరిగ..రాల్చేదే ఓర్పు..!
బలగమెంత ఉందన్నది..అసలుప్రశ్న కాదు..
బంధాలకు తగినవిలువ..కూర్చేదే ఓర్పు..!
ఎవరి భ్రమలు వారివేను..కరుగుటెపుడొ ఏమొ..
ఆశవెంట పరుగులన్ని..ఆపేదే ఓర్పు.
