Ramesh Babu Kommineni

Classics Others

4  

Ramesh Babu Kommineni

Classics Others

ఓ రామ...

ఓ రామ...

1 min
316


ప౹౹ 

కోరి రామా కొలిచితి కొంత ఆ జాగేల

 చేరి చెంగల్వములే అర్పించ పరాకేల ౹2౹


చ౹౹ 

అసుర రాజు పుర మందిరము జొచ్చి 

ఆ ఖర రాక్షాసాదులను నులిమి వచ్చి ౹2౹


మాత సీతమ్మ జాడను బాగా తెచ్చిన 

జాత హనుమ ఎదను నిలిచితి మెచ్చి ౹ప౹


చ౹౹ 

రాతికి పాదరేణువుల రాపిడి చేయగా 

అతివకి ప్రాణములే తిరిగి వచ్చేయగా ౹2౹


ఎంగిలి పండ్లనే భుజియించి విందుగా 

పొంగలి ప్రసాదం అని ఎంచి నిండుగా ౹ప౹


చ౹౹ 

ఘన త్యాగయ్యకు ఇప్పించేవూ ముక్తి 

గగనమైన దర్శనం ఇచ్చేవు చూచి భక్తి ౹2౹


జాగేలా ఆ భాగ్యం కలిగింప నాకింకను 

పరాకేలా పరికించనూ మరి మరింకను ౹ప౹


Rate this content
Log in

Similar telugu poem from Classics