STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

4  

Midhun babu

Romance Classics Fantasy

ఓ ప్రేమ కథ

ఓ ప్రేమ కథ

1 min
12


విరబూసిన ఒక తోటలో ఆమని అరుదెంచినది 

యవ్వనంలో అడుగుపెట్టిన సుమబాల రెమ్మల

చాటున తన సోయగాల హరివిల్లును విరిసింది 


జుంటి తేనియల దప్పికతో అలమటించే భ్రమరం 

వలపు గీతాలను మధురంగా ఆలపించింది గాన

 రసాంబుధిలో మురిసి మైమరచిన సుమకన్య అరమోడ్పు

 కనులతో ఆహ్వానం పలికింది 


అలుపెరుగని మధుపం సుమకాంత వొడిలో చేరింది తనివారగా 

మధుపానముచేసి రెక్కలు విదిలించి అంబరానికి ఎగసింది


 తొలివలపు ఒరవడిలో తనువుకు గాయమై కుసుమ కోమలి నలిగిపోయింది 

వలపు రుచితెలిసిన జవ్వని మలి అనుభవానికి ఆత్రపడింది 


తనివితీరని దాహం భ్రమరానిది కొత్త రుచులు కోరింది పక్కదారి పట్టింది 

విరిసీ విరియని మొగ్గల వెంట పడింది మోసపోయిన చంద్రకాంత ఆవేదనతో ఆత్మహత్యకు పాల్పడి నేలకు రాలింది.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance