STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

ఓ మనసా...

ఓ మనసా...

1 min
237

కుశలమని కబురంపితే నీసొమ్మేం పోతుంది

ఏడున్నావో చెప్తే నీకడ్డేం అవుతుంది

నావెంటే ఉండమన్నానా నాచుట్టూ తిరగమన్నానా

ఏలావున్నావో చెప్పమనేగా అన్నాను

వివరం తెలియక సతమతమవుతున్నాను

మోస్తానన్నావుగా నా భారం మొయ్యి జీవితాంతం

నవ్వుతూ భరిస్తూవున్నావుగా భరించుమరి నీ ఖర్మ ఆజన్మాంతం...

నిన్నటిరోజు మనసు తీరలేదు నేడేమో ఇంకనూ రానేలేదు...

రేపటికైనా నీ మమతను కలుగచేయుమా... ప్రియతమా 

కన్నుల కాయలు కాయించ నీకిది న్యాయమా మనసా..

మనసుకు ఏకాంతం అద్దేసి మాటకు మౌనం ముసుగేసి

కన్నీటిని చిరునవ్వుతో కప్పేసి కోరికల గుర్రాన్ని కట్టేసి

ఆరాటం అంచుని అణిచేసి సంతోషం చీటీని చింపేసి

నిశిలో నిస్పృహలో ఏదోలా అలా జీవించేస్తున్నా...


   ... సిరి ✍️


Rate this content
Log in

Similar telugu poem from Romance