ఓ కాలమా
ఓ కాలమా
నేను మొట్టమొదటిసారి
ఏడ్చినప్పుడు ఎంతమంది
నవ్వారో. నా ఆగమనాన్ని
ఆమోదిస్తూ. ఆనందిస్తూ.
ఆ నవ్వులు ఎన్ని కొత్త
రూపాల్ని,సరికొత్త అర్ధాల్ని సంతరించుకుంటుందో
కదా అనిపిస్తుంది ఒక్కోసారి
కాని కాలమా నీకెంత
అదృష్టమే గడచినా
దానికి దుఖించక.
జరగబోయే దానికి
చింతించక.ఎవరి కోసం
వేచి చూడక నిర్లిప్తంగా
ముందుకు సాగుతూ.
ఈ క్షణం మాత్రమె నిజం
అంటావు ఏ బంధాలకి బంధీ కానంటావు.వెనుకకి
తిరిగి చూడటం
ఎందుకే ఓ కాలమా
తెలియని నిన్ను చూస్తుంటే
నాకు అసూయగా ఉంది.
ఒకరి చింత నీకు లేదు
ఎవరి నుంచి భయము
లేదు. ఎవరికీ ఏమి
దాచావు.ఎవరి నుండి
ఏమి ఆసించవు.
ఓ కాలమా నీ పనే
బాగుంది సుమా
