ఓ ఆడపిల్ల
ఓ ఆడపిల్ల
మాటలన్నీ నీకోసం అరువు తెచ్చుకున్నాను
మౌనాన్ని అంతా కాలగర్భంలో
కరిగిస్తూ వచ్చాను
ఆనందం అంతా నీలోనే చూసుకున్నాను
వేల రకాల పువ్వులన్నీ వెతికి
వర్ణమాలలల్లి నీపాదపూజకు
సమర్పించాను
నీ మనస్సు పంచిన ప్రేమ చూసి
ప్రేమ గురించి నీకు తెలిసినంతగా
ఎవరికీ తెలియదు అనుకున్నాను
కానీ నీకు విశాల హృదయముందని
అందులో నాలాంటి వారెందరో ఉంటారని తెలుసుకున్నాను
పోగొట్టు కున్నది కాలాన్ని
పోగొట్టుకున్నది నా సున్నితమనస్సును
కానీ బాధ పడుతూ కూర్చోవడం నేను చేసేతప్పే కదా
ఆదర్శంగా నిలవాల్సిన నేను
బాధ పడుతూ కూర్చోను
జీవిత విలువలు తెలుసుకుని
నా కెరియర్ పైన ద్రుష్టి పెట్టి నా మీద కోటి ఆశలు పెట్టుకున్న
అమ్మా నాన్న కోసం పెళ్ళి చేసుకుని మంచి కుటుంబాన్ని సృష్టించుకుంటాను
ఎందుకంటే నేను ఆడపిల్లను అనాదిగా తల్లీ తండ్రి ఇంటి పరువు కాపాడటంలో
నేను ముందే ఉండాలి అనుకుని
నాలోని మనస్సును లోకానికి తెలియకుండా మసిలిన దాన్ని కదు
ఆడపిల్లను కదా
ద్వేషించడం రాదు ప్రేమించడం మాత్రమే తెలుసు అమ్మగా కూతురిగా అక్కగా చెల్లిగా భూమాతగా కొండంత సహనం ఉంది కదా నాకు...
