ఒకటే బీజం
ఒకటే బీజం
మాటల కత్తులు..విసిరేదేమిటి..!?
మౌనం గురువని..చెప్పేదేమిటి..!?
రైతుల సేద్యం..రేపటి అన్నం..
ఎవరో దైవం..చూపేదేమిటి..!?
నదీమ తల్లుల..పరుగులు కడలికి..
స్వార్థత్యాగము..కొలిచేదేమిటి..!?
ఒకటే బీజము..వనములు ఎన్నో..
పంచే ఫలములు..ఎంచేదేమిటి..!?
లెక్కల మాష్టర్..మనసే కదరా..
అయోమయముతో..పొందేదేమిటి..!?
ప్రేయసి కోసం..ఎదురు చూపులా..
విరహపు సౌఖ్యం..మరిచేదేమిటి..!?
