న్యస్తాక్షరి
న్యస్తాక్షరి
ఆ,వ,కా,య.
ఉత్పల మాల
(ఆ )పరమేశుడే జగతి కాదియు నంతమటంచు నమ్మికన్
శ్రీపతి సే(వ)లన్ సలుప చిత్తము నందున శాంతికల్గు నా
బాప విదూరుడౌ హరియె భక్తుల (కా)చును కూర్మి తోడుతన్
గాపుగనుండు దేవరను గట్టిగ పట్టి (య)జింప ముక్తిడున్/
--------------------------