నువ్వు...
నువ్వు...
నువ్వు...
నువ్వు గగనంలో మెరిసే చక్కని చుక్కవి. నన్ను చీకటి రాత్రి అలరించే అమూల్యమైన బొమ్మవి.
నువ్వు ఆకాశంలో కనిపించే ఇంద్రధనస్సువి. నన్ను వానకురిసే సమయాన మురిపించే రంగుల గనివి.
నువ్వు ఉద్యానవనంలో విరబూసే అందమైన గులాబివి. నన్ను విహరించే వేళ మైమరపింపజేసే సుగంధానివి.
నువ్వు అవని కనుమల్లో బిరబిరా ప్రవహించే జీవనదివి.
నన్ను పసిడిపండే నేలపై నవ్వులతో రంజింపజేసే జలకన్యవి.
నువ్వు ఇంటిముంగిట్లో వన్నెలు చిలికే రంగవల్లికవి. నన్ను ప్రతి శుభోదయాన కనులకింపుగా ముచ్చటగొలిపే సిరివి...

