STORYMIRROR

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

నల్ల ధనం

నల్ల ధనం

1 min
3

45.


*నల్లధనము*


(తేటగీతి పద్యములు )


1.


నల్లధనమును పెంచుచు కల్లలాడి

మోసగింతురు ప్రభుతను మూఢమతులు

దాచి యుంచిన కాసులు తరలిపోయి

పరుల దేశాన పెరుగును పర్వతముగ/


2.


పన్ను కట్టని వారల భరతమునిట

పట్టుచుందురీ యధికారవర్గమిపుడు

ప్రజల సొమ్మును దాచంగ ఫలితమేమి?

కటకటాలను లెక్కింప కదలుచుంద్రు./


3.


నిష్ఠగా పన్ను కట్టుచు నీతితోడ 

దేశ సుగతికి తోడ్పడి స్థిరముగాను

మంచి పౌరులై నడిచిన మనుజులెల్ల

బడయుచుందురు కీర్తిని పావనముగ./


4.


ప్రజల సొమ్ముతోమనగడ్డ ప్రగతి పెంచి

భావితరతరములకుమేల్ బాటచూపి

నియతితో నేత లెల్లరు నిలిచియుండ 

శాంతివిలసిల్లు ప్రజలకు సకలవిధుల./


5.


ప్రజలకవగాహన పెరిగి భరతజాతి 

భవ్యమైనట్టి పథములో పరుగుపెట్టు

నేటి పాలకుల కున్నట్టి నిష్ఠ గాంచి

జనులు ప్రణతులు సేయంగ జయముకలుగు.//


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics